మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ములుగు జిల్లా కలెక్టర్
మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ములుగు జిల్లా కలెక్టర్
Collector


ములుగు, 15 ఆగస్టు (హి.స.) మహనీయుల సేవలను ఎన్నడు మర్చిపోకుండా స్మరించుకోవాలని, వారి ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande