స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టాలని డిమాండ్: పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టాలని డిమాండ్: పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Pcc


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) రేషన్ కార్డుల వంటి సంక్షేమ పథకాలపై

ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు ఉండాలని బీజేపీ నేతలు చేస్తున్న డిమాండైపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టకుండా, అనవసరమైన అంశాలతో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా అందలేదని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రధాని మోడీ ఫొటోలను రేషన్ కార్డులపై ముద్రించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఫొటో లేకపోతే ఉద్యమం చేస్తామనడం వారి విద్వేశ రాజకీయ ఆలోచనలకు నిదర్శనం. దేశాన్ని, పదవులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు, ఈ విషయంలో మాకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు. మేము ప్రజా సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ ఇలాంటి అర్థం లేని డిమాండ్ల కోసం కాదు అని ఆయన స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande