రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్రెడ్డి
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
Revanthreddy


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్య, వైద్యం.. ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని తెలిపారు.

‘‘ఇప్పటికే ఉస్మానియా కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణంలో ఉంది. 8 కొత్త మెడికల్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తున్నాం. విద్యా సూచీలో 21వ స్థానంలో ఉన్న తెలంగాణ 14కు చేరుకుంది. నియోజకవర్గానికొక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాం. వందకు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మించే లక్ష్యంతో ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అక్రమాలు జరగకుండా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహించాం. త్వరలో జరిగే ఖేల్ ఇండియా పోటీలకు హైదరాబాద్ అతిథ్యం ఇస్తుంది. టీఎస్ ఐపాస్ ద్వారా రూ.1.95లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మరో 78వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయి. నగరంలో ఇప్పటికే 355కు పైగా జీసీసీలు పనిచేస్తున్నాయి. అమెజాన్ సంస్థ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ఉన్నాం. మహిళలను ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశాం. 15 లక్షలకు పైగా కొత్త రేషన్కార్డులు మంజూరు చేశాం. రెండో విడత కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇవాళే ప్రారంభించుకుంటున్నాం. వృద్ధ తల్లిదండ్రుల కోసం చట్టం చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ’’ అని సీఎం వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande