
హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) వరంగల్-హైదరాబాద్ హైవేపై ఘట్కేసర్ వద్ద జరిగిన ప్రమాదంలో బాలిక మృతి చెందింది. వేగంగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టడంతో శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు సురేశ్, ఉమకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్