సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Whip


రాజన్న సిరిసిల్ల, 15 ఆగస్టు (హి.స.) సంక్షేమమే లక్ష్యంగా.. అభివృద్దే

ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి.. వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, పోలీస్, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితేలు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande