మారుమూల గిరిజన గ్రామాలకు రూ. 45 కోట్లతో శాశ్వత రోడ్డు వసతుల కల్పన
మారుమూల గిరిజన గ్రామాలకు రూ. 45 కోట్లతో శాశ్వత రోడ్డు వసతుల కల్పన
మారుమూల గిరిజన గ్రామాలకు రూ. 45 కోట్లతో శాశ్వత రోడ్డు వసతుల కల్పన

ఆదిలాబాద్, 15 ఆగస్టు (హి.స.)

ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలలోని అత్యంత వెనుకబడిన, మారుమూల గిరిజన గూడేలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఐటీడీఏ (ITDA) ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. దాదాపు రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ శాశ్వత బీటీ రోడ్ల ద్వారా వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అనేక గ్రామాలకు రవాణా సులువవుతుంది. గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా ఈ రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమని, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఇవాళ ఉదయం అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande