పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ దేవాలయం పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం
పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ దేవాలయం పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం
పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ దేవాలయం పాలకవర్గ మండలి ప్రమాణ స్వీకారం

నందిగామ:, 16 ఆగస్టు (హి.స.)

జగ్గయ్యపేట మండలం పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ దేవాలయం పాలకవర్గ మండలి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయం ఛైర్మన్గా చుంచు రమేశ్బాబు, 13 మంది సభ్యులతో ఈవో లీలాకుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ధర్మకర్తల మండలి సభ్యులను ఆశీర్వదించారు. ఛైర్మన్, సభ్యులను కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande