శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం
Road accident


నంద్యాల, 16 ఆగస్టు (హి.స.)

, శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్కు బ్రేక్ ఫెయిల్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారును ఢీకొట్టంది. అనంతరం డీసీఎం వ్యాన్ రహదారికి అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే సాక్షి గణపతి శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. మరో వైపు ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా వాహన రాకపోకలు సాగుతున్నాయి. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande