డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ బొల్లా బ్రదర్స్ గంజాయి దందాకు తెరదీసినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు.
Drugs


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) డెడ్ డ్రాప్ గంజాయి కేసులో (Dead Drop Ganja Case) వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటూ బొల్లా బ్రదర్స్ గంజాయి దందాకు తెరదీసినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేసే ముసుగులో బొల్లా బ్రదర్స్ గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు బొల్లా బ్రదర్స్ చోరీల కేసులో సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఇలా పోలీసులతో దోస్తీ పెంచుకొని గంజాయి దందాకు బొల్లా బ్రదర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈగల్ ఫోర్స్ బొల్లా బ్రదర్స్ ఇంటిపై దాడులు చేసిన సమయంలో కానిస్టేబుల్స్ ఇంట్లోనే కల్లు పార్టీలో ఉన్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్స్ను మందలించి అక్కడ నుంచి ఈగల్ టీమ్ అధికారులు పంపించారు. రోజుకు 25 సార్లు డెడ్ డ్రాప్ పద్ధతిలో గంజాయిను ఈ ముఠా సప్లై చేస్తోంది. నంబర్ ప్లేట్ లేని 3 ద్విచక్ర వాహనాల ద్వారా గంజాయిని వినియోగదారులకు ఈ ముఠా సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. బొల్లా బద్రర్స్తో పార్టీలు చేసుకొనే ఓ ఎస్ఐ పోలీస్ మ్యాన్ ప్యాక్ (వాకీ టాకీ )ని బొల్లా బ్రదర్స్ కారులో వదలి వెళ్లినట్లు గుర్తించారు.

మ్యాన్ ప్యాక్ వ్యవహారంపై ఇప్పటికే ఆ ఎస్ఐను సైబరాబాద్ పోలీసులు ప్రశ్నించారు. ఒడిశా నుంచి ఈ గంజాయి సరఫరా కోసం 30 మందికిపైగా నియమించుకున్నట్లు ఈగల్ అధికారుల విచారణలో వెల్లడైంది. రెండు నెలలు క్రితం బొల్లా బ్రదర్స్లో ఒక్కరిని ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకొని ఫోన్ సీజ్ చేసింది. దీంతో పోలీసుల చర్యలను అడ్డుకోవడానికి కోర్టులో బొల్లా బ్రదర్స్ రిట్ పిటిషన్ దాఖలు వేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande