72 అడుగుల మట్టి గణపతి.. HYD నాగోల్లో భారీ విగ్రహం
భాగ్యనగరంలో వినాయక చవితి (Vinayaka Chaviti) సందడి నెల రోజుల ముందు నుంచే నెలకొంది.
Ganesh idol


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.) భాగ్యనగరంలో వినాయక చవితి (Vinayaka Chaviti) సందడి నెల రోజుల ముందు నుంచే నెలకొంది. ఇప్పుడు అంతా గణేశుడి విగ్రహాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో నాగోల్లోని తిరంగ్ యూత్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఆసక్తి రేకెత్తిస్తోంది. గత పదేళ్లుగా ఈ అసోసియేషన్ మట్టి విగ్రహాన్నే (Eco Friendly) ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 అడుగుల భారీ మట్టి గణపతిని తయారు చేయిస్తున్నారు.ఇక ఖైరతాబాద్ వినాయకుడిని కూడా తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ సారి మరింత ఆకర్షణీయంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు జరగబోతున్నాయడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande