
అమరావతి, 16 ఆగస్టు (హి.స.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 29 మంది ఉత్తమ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను (Best Teacher Awardees) అంతర్జాతీయ విద్యా విధానాలపై శిక్షణ కోసం ఫిన్లాండ్ దేశానికి పంపుతున్నారు. ఈ ఉదయం అమరావతిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఉపాధ్యాయుల బృందాన్ని కలిసి అభినందనలు తెలిపి, ప్రయాణ కిట్లను అందజేశారు. ఆగస్టు 17 (రేపటి) నుండి ఫిన్లాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ఈ అంతర్జాతీయ విద్యా ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. అక్కడ అనుసరిస్తున్న ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ లెర్నింగ్ మరియు విద్యార్థుల మానసిక వికాసానికి సంబంధించిన వ్యూహాలను ఈ బృందం అధ్యయనం చేసి, తిరిగి వచ్చిన తర్వాత ఏపీలోని స్కూళ్లలో అమలు చేయనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi