ఆటోలకు రెట్రోఫిట్ స్కీమ్ అమలు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆటోలకు రెట్రోఫిట్ స్కీమ్ అమలు: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా క్యూర్ ప్రాంతంలోని అర్హత కలిగిన ఆటో యజమానులందరికీ ఈ రూ.1.50 లక్షల సబ్సిడీ పథకం అమలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం-2026ను రూపొందిస్తున్నామని తెలిపారు. నగరంలో ఉన్న పెట్రోల్, డీజీల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు రూ.200 కోట్లతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ అమలుకు ఇటీవల తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకంపై ఆదివారం మంత్రి పొన్నం కీలక ప్రకటన చేశారు.

అర్హత కలిగిన ప్రతి ఆటో యజమానికి రెండు అవకాశాలు కల్పిస్తున్నానమి అందులో ఒకటి ప్రస్తుత ఆటోను AIS–123 ఆమోదించిన ఎలక్ట్రిక్ కిట్తో రెట్రోఫిట్ చేసుకోవడం లేదా పాత ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా ఆటో యజమానికి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047కు అనుగుణంగా ఈ పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం ద్వారా వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఆటో డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ఖర్చు నుంచి ఆర్థిక ఉపశమనం కల్పించాలన్నదే మా లక్ష్యం. హైదరాబాద్ను స్వచ్ఛమైన గాలి, సుస్థిర ప్రజా రవాణా దిశగా తీసుకెళ్లడంతో పాటు ఆటో డ్రైవర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేలా ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande