కేసీఆర్ పాలన - అభివృద్ధికి స్వర్ణయుగం : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
కేసీఆర్ పాలన - అభివృద్ధికి స్వర్ణయుగం : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
Mlc


భద్రాద్రి కొత్తగూడెం, 16 ఆగస్టు (హి.స.)

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ

రాష్ట్రానికి స్వర్ణయుగమని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల బాగోగులు చూసిన వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూనే.. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, పాలనా పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని రవీందర్ రావు కొనియాడారు. ఒకప్పుడు కరెంటు లేక, సాగునీరు రాక అల్లాడిన తెలంగాణను.. కేసీఆర్ తన దార్శనికతతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సస్యశ్యామలమైన బీడు భూములు కేసీఆర్ కృషితోనే సాధ్యమయ్యాయని వివరించారు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ ప్రభుత్వం అండగా నిలిచింది అని ఆయన గుర్తుచేశారు. మాయమాటలు చెప్పి, అమలుకాని హామీలు ఇచ్చి

అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొద్ది నెలల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పాలన మొదలవగానే రాష్ట్రానికి మళ్లీ కరెంటు కోతలు, రైతుల కష్టాలు తిరిగొచ్చాయి. కేసీఆర్ గారు తెచ్చిన అద్భుతమైన సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ, అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు. పరిపాలన చేతకాక, తెలంగాణను ఒక అంధకారంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను గాలికొదిలేసి, రైతులను, యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఆయన దుయ్యబట్టారు. పదేళ్ల పాటు ఎంతో కష్టపడి నిర్మించుకున్న 'బంగారు తెలంగాణ'ను కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనంతో నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande