
తిరుమల , 16 ఆగస్టు (హి.స.)
కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ ఏడాది జరగబోయే అత్యంత పవిత్రమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఇప్పుటి నుంచే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా స్వామివారికి 'నవరాత్రి బ్రహ్మోత్సవాలు' మరియు 'సాలకట్ల బ్రహ్మోత్సవాలు' అనే రెండు జంట బ్రహ్మోత్సవాలు (Twin Brahmotsavams) నిర్వహించాల్సి రావడంతో భక్తుల రద్దీ ఊహించని విధంగా ఉంటుందని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ఈ ఉదయం మీడియాకు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లడ్డూ ప్రసాదాల నిల్వలు, తాగునీరు, వసతి గదులు మరియు క్యూలైన్ల నిర్వహణను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అందించే సేవల నాణ్యతను మరింత పెంచేందుకు ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi