జాతీయ జెండాకు అవమానం విమర్శలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్కు బండి కౌంటర్(update)
జాతీయ జెండాకు అవమానం విమర్శలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్కు బండి కౌంటర్
Bandi


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉండగా విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అధికారం దూరం కాగానే దేశంలో మంచి కాలేజీలే లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

భారతదేశం కంటే శ్రీలంక మెరుగైనదని మాట్లాడుతున్నారని లంక భారత్ కంటే గొప్పదని రావణాసురుడు మాత్రమే భావిస్తాడని బండి సంజయ్ విమర్శించారు. రామ భక్తులు తమ మాతృభూమిని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడరని, దేశంలో అధికారం, ప్రజల సంపదపై నియంత్రణ కావాలి కానీ, ప్రశ

శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మూడురంగుల క్లాత్తో చెమట తుడుచుకోవడంపై బండి సంజయ్ స్పందించారు. తాను చెమట తుడుచుకోవడానికి కండువా ఉపయోగించుకున్నందుకు తన దేశభక్తిని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జీవితాంతం కాషాయ జెండా, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తానని, అవసరం అయితే దేశం కోసం తన రక్తాన్నే దారపోస్తానన్నారు. దేశభక్తి తనకు చర్చనీయాంశం కాదని, జీవితాంతం పాటించే విశ్వాసమని పేర్కొన్నారు. తనకు ఎప్పుడూ దేశమే ఫస్ట్ అని వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande