కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన
కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన
rain


హైదరాబాద్, 16 ఆగస్టు (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో అకస్మాత్తుగా తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు కోస్తాంధ్ర మరియు రాయలసీమ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈ ఉదయం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలుచోట్ల తీవ్రమైన పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు, గొర్రెల కాపరులు పొలాలకు వెళ్లేటప్పుడు లేదా పశువులను మేపేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కంట్రోల్ రూమ్ సిబ్బంది సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande