శ్రావణ మాసం ఎఫెక్ట్.. చికెన్, కోడి గుడ్ల ధరలు ఢమాల్.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
శ్రావణ మాసం ఎఫెక్ట్.. చికెన్, కోడి గుడ్ల ధరలు ఢమాల్.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
శ్రావణ మాసం ఎఫెక్ట్.. చికెన్, కోడి గుడ్ల ధరలు ఢమాల్


కర్నూలు, 16 ఆగస్టు (హి.స.)శ్రావణ మాసం రాకతో చాలామంది నాన్ వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నారు. శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినరు. మళ్లీ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత తినడం మొదలుపెడతారు. దీని ప్రభావంతో ఈ మాసం వచ్చిందంటేనే.. చికెన్, కోడి గుడ్లకు డిమాండ్ భారీగా తగ్గిపోతూ ఉంటుంది. దీని వల్ల వీటి ధరలు పడిపోతూ ఉంటాయి. ఈ సారి కూడా అదే జరిగింది. శ్రావణ మాసం రాకతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. గత నెలలో కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. ఒక్కో గుడ్డు ధర రూ.8 వరకు చేరుకుంది. కానీ ఇప్పుడు చికెన్తో పాటు గుడ్ల ధరలు కూడా పడిపోయాయి. గత కొద్ది రోజులలో ఈ రెండింటి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం చికెన్, కోడి గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే

-ఆగస్ట్ 16న కర్నూలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.222 పలుకుతుండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.197కి చేరుకుంది. ఇక రిటైల్ లైవ్ బర్డ్ రూ.127గా ఉండగా.. ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.100 వద్ద కొనసాగుతోంది. ఇక వరంగల్ డివిజన్లో్ కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు విజయవాడ జోన్ పరిధిలో కేజీ స్కిన్లెస్ చికెన్ రూ.240 వద్ద పలుకుతుండగా.. డ్రస్స్డ్ చికెన్ రూ.212, రిటైల్ లైవ్ బర్డ్ రూ.137, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.110గా ఉంది. ప్రాంతాలను బట్టి చికెన్ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. స్థానిక ఫామ్స్, రవాణా ఖర్చుల ఆధారంగా ధరల్లో మార్పులు ఉంటాయి.

కోడి గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

విజయవాడ జోన్ పరిధిలో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.75గా కొనసాగుతోంది. ఇక కర్నూలు, రాయలసీమా జోన్ పరిధిలో రూ.74గా ఉంది. శ్రావణ మాసం రాకతోనే ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మాసం పూర్తయ్యేవరకు ధరలు ఇలాగే కొనసాగుతాయని, మరింత తగ్గే అవకాశముందని షాపుల నిర్వాహకులు ఆదోని కాటిక్ మధుసూధన్ చెబుతున్నారు. కోళ్లకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. దీంతో తమకు ఆదాయం కూడా తగ్గిపోతుందని ఆవేదన చెందుతున్నారు. అయితే గత నెలలో చికెన్ ధర రూ.340కి చేరుకోగా.. ఇప్పుడు రూ.240 పలుకుతుంది. కొద్ది రోజుల్లోనే రూ.100 మేర పడిపోయింది. రానున్న రోజుల్లో మరికొంత తగ్గే అవకాశాలున్నట్లు ఫామ్స్ నిర్వహకులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande