తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 1.4 శాతం తగ్గి ఔన్స్కు 4,592 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతంలో ఇదే ధర 4,650 డాలర్లకు పైగా నమోదైంది. మంగళవారం బంగారం ధర మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది..
gold


Andhra Pradesh, 27 ఆగస్టు (హి.స.)దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు, ఆగస్టు 27 గురువారం భారీగానే కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.1.63,740 వరకు వెళ్లింది. ఈ వ్యత్యాసాన్ని చూస్తే ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో అర్థమైపోతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, డాలర్ బలపడటం, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ.2,59,000గా నమోదైంది. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ప్రస్తుతం కొంత బ్రేక్ పడుతుందేమోనని భావిస్తున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది.

హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,890, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,240 వద్ద కొనసాగుతోంది.

ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నైలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,090 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande