
ముంబై, 26 ఆగస్టు (హి.స.)పండుగ సీజన్ ప్రారంభానికి ముందు బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఈ నెలలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. భారతదేశంలో రక్షాబంధన్తో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీనివల్ల భారతదేశంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగవచ్చంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. గత కొన్ని రోజులుగా ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం తులం రూ.1.54 లక్షలు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు రూ.1.63 లక్షలకుపైగా చేరుకుంది. తాజాగా ఆగస్ట్ 26వ తేదీన హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉంది. అంటే దాదాపు రూ.1.64 లక్షలకు చేరువలోనే ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,890 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,240 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV