సర్వే పారదర్శకంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ హరిత
సర్వే పారదర్శకంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ హరిత
Collector


ఆసిఫాబాద్, 29 ఆగస్టు (హి.స.)

భూ రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం దహెగాం మండలంలోని అమర్ గూడ గ్రామంలో చేపట్టిన భూ సర్వే పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ రీ-సర్వే ప్రక్రియలో గ్రామ పొలిమేర. ఆవాస ప్రాంతాల సరిహద్దులతో పాటు ప్రభుత్వ భూముల సరిహద్దుల ఖచ్చితమైన నిర్ధారణ చేసేలా పకడ్బందీగా సర్వే చేపట్టాలన్నారు. ఇందుకోసం రైతుల భాగస్వామ్యం అత్యంత కీలకమని చెప్పారు. సర్వే పనుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా. నిబంధనలు ప్రకారం. నిర్ణీత గడువు లోపు సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande