విశాఖ జిల్లా మారక వలసలోనే గురుకుల బాయ్స్ ఇంగ్లీష్ మీడియం.రెసిడెన్సియల్ స్కూల్
విశాఖ జిల్లా మారక వలసలోనే గురుకుల బాయ్స్ ఇంగ్లీష్ మీడియం.రెసిడెన్సియల్ స్కూల్
విశాఖ జిల్లా మారక వలసలోనే  గురుకుల బాయ్స్ ఇంగ్లీష్ మీడియం.రెసిడెన్సియల్ స్కూల్


పాడేరు, 29 ఆగస్టు (హి.స.)

విశాఖ జిల్లా మారికవలసలోనే యథావిధిగా గురుకులం బాయ్స్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్) (ఎస్ఓఈ) కొనసాగించేందుకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను వేర్వేరు పాఠశాలలకు తరలించి పూర్తిగా ఈ పాఠశాలను మూసివేసే ప్రక్రియను ఇటీవల ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో గత 3 రోజుల నుంచి ఈ పాఠశాల కొనసాగింపు కోసం పట్టుబట్టి ఐటీడీఏ గేటు వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలు బైఠాయించి, సాగించిన పోరాటం ఫలించింది. పోలీసులతో ధర్నా శిబిరం తొలగింపు, ఆదివాసీ సంఘాల నేతలు అప్పల నరస, ధర్మన్నపడాల్, రాధాకృష్ణ అరెస్టుల పర్వంతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రజా పోరాటం సిద్ధించింది.

ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మతోపాటు జిల్లా ఎస్పీ ధర్నా శిబిరం వద్దకు వచ్చి గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను యథావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. దీంతో మారికవలస ఎస్ఓఈ పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడే ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆదివాసీ నేత అప్పల నరస జండా ఊపి విద్యార్థుల బస్సులను పాఠశాలలకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande