
కంకిపాడు రూరల్:, 29 ఆగస్టు (హి.స.)
కృష్ణా జిల్లా పెడన తెదేపా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడన వెళ్తుండగా.. గంగూరు వద్ద ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కృష్ణప్రసాద్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ