
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ ' పుస్తకానికి భారత్ లో తాము ప్రచురణకర్తలం కాదని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (PRHI) చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పందిస్తు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. స్వయంగా రాసుకున్న ఒక ఆత్మకథే విచారణకు, వాస్తవాల పరిశీలనకు గురికావాల్సి వచ్చిందంటే.. కాంగ్రెస్ నాయకులు చేసే వ్యాఖ్యల్లో విశ్వసనీయత ఎంత ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆ పుస్తకంలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో పాఠకులు కూడా స్వయంగా పరిశీలించుకోవాలని అన్నారు. సోనియా గాంధీ రాసిన ఈ పుస్తకంపై గతంలో భారీ స్థాయిలో ప్రచారం కల్పించారని, అయితే ఇప్పుడు కొన్ని అంశాల్లో వాస్తవాలను పరిశీలించాల్సి (ఫ్యాక్ట్-చెక్) ఉందని ప్రచురణకర్త కోరడం కాంగ్రెస్ నైజానికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అబద్ధాలు, కల్పిత కథనాలపైనే ఆధారపడుతుందనడానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనమని రాంచందర్ రావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు