
భద్రాచలం, 29 ఆగస్టు (హి.స.)
వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం వద్ద పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు శనివారం భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు శంకుస్థాపన చేశారు. రూ.46.65 కోట్లతో ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కొత్త ఘాట్ల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న ఘాట్ల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. పుష్కరాల సమయంలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉండటంతో, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నూతన ఘాట్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..