
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97 పై విద్యార్థుల్లో అపోహ లున్నాయని అందువల్ల పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్కిల్స్ తో పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని దేశంలో ఉన్న విధానమే తెలంగాణలోనూ ఉండాలన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను ఇంజినీరింగ్లో లోనే ఉంచాలని, పాలిటెక్నిక్ ను లేబర్ శాఖకు మార్చొద్దన్నారు.
శక్తి స్కీం పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో తమ భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని, జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా విద్యార్థులకు ప్రతిపక్షాలుసైతం మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కే.కేశవరావు నేతృత్వంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..