ఏపీ జే ఏ సీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి, 29 ఆగస్టు (హి.స.)

,ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు (శనివారం) మీడియాతో మంత్రి అనగాని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలే అజెండాగా బొప్పరాజు పనిచేస్తున్నారా...? లేక పొలిటికల్ అజెండాతో పని చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. బొప్పరాజు వ్యవహర శైలిపై పలు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులకు - ప్రభుత్వానికి ఉన్న సఖ్యతను చెడగొట్టడానికి బొప్పరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande