ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు : ములుగు జిల్లా కలెక్టర్
ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు : ములుగు జిల్లా కలెక్టర్
Collector


ములుగు, 29 ఆగస్టు (హి.స.)

ప్రణాళికాబద్ధమైన బోధనతో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థినులకు నిర్ణీత ఆహార పట్టిక ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూనియర్ కళాశాల విద్యార్థినులకు నిర్వహిస్తున్న యూనిట్ పరీక్షల తీరును పరిశీలించి పరీక్షల నిర్వహణపై సంబంధిత ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోజనం తయారీలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, విద్యాభ్యాసం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande