నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో 565 జాతీయ రహదారి పై రోడ్డు.ప్రమాదం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో 565 జాతీయ రహదారి పై రోడ్డు.ప్రమాదం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలో 565 జాతీయ రహదారి పై రోడ్డు.ప్రమాదం

మర్రిపాడు , 29 ఆగస్టు (హి.స.)

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం, చుంచులూరు సమీపంలో 565 నంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి బద్వేల్ వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande