టమోటా.. నష్టాల మూట! లక్షల్లో నష్టపోతున్న రైతులు
టమోటా.. నష్టాల మూట! లక్షల్లో నష్టపోతున్న రైతులు
కర్నూలు : మరోసారి కుప్పకూలిన టమోటా ధరలు


రొద్దం(అనంతపురం), 29 ఆగస్టు (హి.స.) : ఆశల పంట నష్టాల మూటగా మారింది. టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. రైతులకు పెట్టుబడులు కూడా దక్కట్లేదు. దీంతో అన్నదాతలు లక్షల రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నారు. మండలంలోని ఆర్ కొట్టాల, రాచూరు, దొడగట్ట, ఆర్ మరువపల్లి, వైటిరెడ్డిపల్లి, రాగిమేకలపల్లి, బూచర్ల, బొక్సంపల్లి తదితర గ్రామాల్లో టమోటా సాగు చేశారు. ఎకరానికి రూ.లక్షదాకా పెట్టుబడి పెట్టారు. కట్టెలు నాటి దారం కట్టు పద్ధతి పాటిండచంతో ఖర్చులు పెరిగాయి. ఆర్ కొట్టాల గ్రామానికి చెందిన రైతు పెద్ద ఎర్రిస్వామి తనకున్న రెండెకరాల పొలంలో టమోటా పెట్టాడు.

రూ.2 లక్షలు ఖర్చయింది. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరలు పతనమవడంతో కూలీ ఖర్చులు కూడా రావడంలేదని రైతు వాపోయాడు. మార్కెట్లో 15 కేజీల టమోటా క్రేట్ రూ.150 పలుకుతోంది. పది మంది కూలీలకు రూ.300 చొప్పున ఇవ్వాలి. మార్కెట్కు తరలించడానికి వాహనానికి క్రేట్కు రూ.30 ఇవ్వాలి. మార్కెట్లో నూటికి రూ.2 కమిషన్ ఇవ్వాలి. తదితర వాటితో తడిసి మోపెడవుతున్నాయి. రోజుకు 200 క్రేట్లు వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande