జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయాలి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి!
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి నేతృత్వంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం. నేషనల్ హైవే పనులు, పీఎం రాహత్ ఉచిత వైద్య పథకంపై సమీక్ష.
kurnool-collector-dr-a-siri-directs-action-on-national-highway-safety


కర్నూలు, 29 ఆగస్టు (హి.స.) జాతీయ రహదారికి సంబంధించి అభివృద్ధి చేస్తున్న సర్వీస్ రోడ్లు, వాహన అండర్పాస్లు (VUP), బ్లాక్ స్పాట్ల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు రహదారి భద్రత చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించి 10 రోజుల్లోగా పురోగతిపై తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఆనంద్ థియేటర్ వద్ద రైల్వే పనులు జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు గాను పాత కల్లూరు రోడ్డు నుండి హైదరాబాద్–బెంగుళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హోటల్ కేశవ్ గ్రాండ్ సమీపంలోని ప్రస్తుత రహదారిని అనుసంధానించే పనులలో భాగంగా వచ్చే నెల నాటికి ప్రగతి కనిపించేలా మెటల్ రోడ్డు పనులు ప్రారంభించి బస్సుల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande