జగన్కు BIG షాక్.. టీడీపీతో వైసీపీ ముఖ్యనేత సీక్రెట్ డీల్: పెద్ద బాంబ్ పేల్చిన విజయసాయి రెడ్డి
జగన్కు BIG షాక్.. టీడీపీతో వైసీపీ ముఖ్యనేత సీక్రెట్ డీల్: పెద్ద బాంబ్ పేల్చిన విజయసాయి రెడ్డి
జగన్


కడప, 29 ఆగస్టు (హి.స.) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆ పార్టీ నాయకత్వం, ‘కోటరీ’ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను నమ్మకద్రోహి అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన శనివారం ఒక సుదీర్ఘ బహిరంగ లేఖను విడుదల చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తాను నాలుగు సంవత్సరాల రాజ్యసభ పదవీ కాలాన్ని, పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నానని, త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని' ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

నమ్మకద్రోహిని కాదు.. జగన్ మోహన్ రెడ్డికి తాను ఎప్పుడూ నమ్మకస్తుడిగానే ఉన్నానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను నమ్మకద్రోహినే అయితే అప్పట్లోనే సజ్జల మాదిరిగా కాంగ్రెత్తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ ఛార్జిషీట్ల నుంచి తప్పించుకునేవాడినని వ్యాఖ్యానించారు. జగన్తో పాటు తాను కూడా 15 నెలలు జైలు జీవితం గడిపానని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీలో ప్రస్తుతం జగన్ నంబర్-2గా, సకల శాఖల మంత్రి ‘సజ్జల రామకృష్ణారెడ్డి’ నంబర్-1గా మారారని ఆరోపించారు. సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దక్కకుండా మధ్యలో గోడలా మారారని మండిపడ్డారు. చివరికి జగన్కు కుటుంబ సభ్యులు దూరం కావడానికి కూడా సజ్జలే కారణమని ఆరోపించారు. 2022 మంగళగిరి ప్లీనరీలో సజ్జల తనపై నేరుగా భౌతిక దాడికి దిగినా జగన్ ప్రేక్షకపాత్ర వహించారని సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కోటరీ ఒత్తిళ్లతో జగన్ తనను ముసలోడు అయిపోయాడు అని వ్యాఖ్యానిస్తూ కీలక బాధ్యతల నుంచి, కోర్ కమిటీ నుంచి తప్పించారని.. తనను అవమానించిన సంఘటనలు మొత్తం 74 ఉన్నాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande