బోనమెత్తిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్లో లాల్దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు.
Bandi sanjay


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లో లాల్దర్వాజా బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల దేశమంతా సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకున్నానని చెప్పారు. రాష్ట్రప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande