సత్యనారాయణపురం మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మోసం
సత్యనారాయణపురం మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మోసం
fraud


అమరావతి, 09 ఆగస్టు (హి.స.)

మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మోసం ఒక్క విజయవాడకే పరిమితం కాలేదు. ఆంధ్ర, తెలంగాణల్లో పలు ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో డిస్ట్రిబ్యూటర్లను నియమించి.. భారీగా డిపాజిట్లను వసూలుచేసి బోర్డు తిప్పేశారు. పోలీసుల దర్యాప్తులో ముఖ్యాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపాజిటర్ల ఫిర్యాదుతో సత్యనారాయణపురం స్టేషన్లో కేసు నమోదైంది. ఈవ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఈనెల 10న అందరికీ సొమ్ము చెల్లిస్తామని సంస్థ ఎండీ అంకుశం నమ్మిస్తున్నారు. మోసం.. రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. బాధితులు సత్యనారాయణపురం స్టేషన్కు వరుసకడుతున్నారు. రెండ్రోజుల్లో 373 మంది ఫిర్యాదు చేయగా... ఎండీ, కీలక వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బోర్డు తిప్పేద్దామనే ఆలోచనతోనే చివరి నెలలో భారీగా డిపాజిట్లను వసూలు చేశారు. ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించి.. బంగారు బ్రాస్లెట్లు ఇస్తానని అంకుశం ఆశపెట్టాడు. చివరి మూడు వారాల్లోనే రూ.15 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇందులో రమేష్రెడ్డి, పవన్ తదితరులు కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కువ మొత్తం రాగానే గుట్టుచప్పుడు కాకుండా సర్దుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande