భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్
సింహా వాహిని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భాగ్యనగర మహిళలకు ఈ సందర్బంగా ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
KTR


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని సింహా వాహిని అమ్మవారిని కోరుకున్నానని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దేశం కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. ఆదివారం బోనాలు సందర్భంగా లాల్ దర్వాజాలోని అమ్మవారిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్తో కలిసి కేటీఆర్ దర్శించుకున్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సింహా వాహిని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భాగ్యనగర మహిళలకు ఈ సందర్బంగా ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మీరాలం మండిలోని శ్రీ మహంకాళి అమ్మవారిని కూడా కేటీఆర్ దర్శించుకున్నారు.

కేసీఆర్కే ఆ గౌరవం దక్కింది: తలసాని

ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగ ప్రసిద్ధి చెందిందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 50 ఏళ్ల నుంచి బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ ఉన్నా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కేసీఆర్, బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. దేవాలయాలకు నిధులు ఇవ్వడం కూడా కేసీఆర్ హయాంలోనే ప్రారంభమైందని అన్నారు.

కేసీఆర్కే ఆ గౌరవం దక్కిందని తెలిపారు. అమ్మ వారి దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. వర్షాలు బాగా కురవాలని, అందరూ కలిసి మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించినట్లు తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande