ఆదివాసీల హక్కుల కోసం కలిసి నిలబడదాం: సీఎం రేవంత్ రెడ్డి
ఆదివాసీల హక్కుల కోసం కలిసి నిలబడదాం: సీఎం రేవంత్ రెడ్డి
Cm


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)

ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం - ఆదివాసీ సంస్కృతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ యావత్ మానవాళికి మార్గదర్శకం అని పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలని పేర్కొన్నారు. జల్-జంగల్-జమీన్ పరిరక్షణలో వారి స్ఫూర్తి సదా ఆదర్శం అని కొనియాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande