
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ నగరాన్ని నైపుణ్య రాజధానిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రాయదుర్గం టీ వర్క్స్లో క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ (క్యూటీఎఫ్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఫ్యూచర్ స్కిల్స్ సమిట్, అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనతోపాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ పాల్గొన్నారు. శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ‘గ్రామీణ ప్రాంతాల యువత కోసం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అభివృద్ధి చేస్తున్నాం. యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్న క్యూటీఎఫ్ఎస్ఎఫ్కు సహకారం అందిస్తాం’ అని పేర్కొన్నారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ... జర్మనీ వంటి దేశాల్లో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డా.పావని కడియాల రచించిన మాస్టరింగ్ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్