
భద్రాద్రి కొత్తగూడెం, 09 ఆగస్టు (హి.స.)
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఆదివారం మణుగూరులో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరవీరులైన మహనీయులు కొమురం భీం, బిర్సా ముండా, సమ్మక్క సారలమ్మ లను స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసులు పోరాటాలు చేసి హక్కులను కాపాడుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాలకు విద్యా, వైద్యం, రోడ్ల సౌకర్యం కోసం ఈ ప్రజా ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేస్తుందన్నారు. రాజ్యాంగంలో ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహావీరుల ఆశయాలను స్పూర్తిగా తీసుకొని పోరాటాలు చేసి హక్కులు సాధించు కోవాలన్నారు. అనంతరం కొమురం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మణుగూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..