
శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, 09 ఆగస్టు (హి.స.)
భారత వాతావరణ శాఖ (IMD) రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం ఉంటుందని హెచ్చరించింది. దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రెండు ప్రధాన మార్గాల నుండి ఈ యాత్ర నిలిచిపోగా, సాంప్రదాయ పహల్గామ్ మార్గంలో కేవలం 'ఛడీ ముబారక్' ఊరేగింపు మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. ఆగస్టు 28న ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ముగియనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi