బీహార్లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళల దుర్మరణం
బీహార్లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళల దుర్మరణం
Road accident


బీహార్, 09 ఆగస్టు (హి.స.)

బీహార్లోని మధుబని జిల్లాలో ఆదివారం భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ఎసయూవీ (SUV) వాహనం అదుపుతప్పి ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని బెనిపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిసబ్ గ్రామంలో ఉన్న జగదాంబ పెట్రోల్ పంప్ సమీపంలో, స్టేట్ హైవే-52 పై ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులను మధుబని జిల్లా అరైర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌతోలి గ్రామానికి చెందిన రీటా దేవి, కిరణ్ దేవి, ఫూల్దే దేవిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన ఎస్ఈూవీ వాహనాన్ని, డ్రైవర్ను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు మీడియాకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande