
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.)
ఆగస్టు 15 నుంచి 'పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇంటింటా జాతీయ జెండా, ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి నింపాలని సీఎం పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సీఎం స్పష్టం చేశారు. 'మై నేషన్-నేషన్ ఫస్ట్' అనే భావన ప్రతి ఇంటికీ చేరాలని ఆకాంక్షించారు. 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేయాలన్నారు. వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్యాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో స్వచ్ఛంధ సేవా స్ఫూర్తిని పునరుద్ధరించాలని చంద్రబాబు నొక్కి చెప్పారు. అలాగే రాష్ట్రం సాధించిన ప్రగతిపై ఏటా ఆగస్టు 15న ప్రత్యేక నివేదికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi