మహారాష్ట్రలో లీటర్ పాల ధర రూ.2 పెంచాలని నిర్ణయం
మహారాష్ట్రలో లీటర్ పాల ధర రూ.2 పెంచాలని నిర్ణయం
Milk


ముంబై, మహారాష్ట్ర, 09 ఆగస్టు (హి.స.)

మహారాష్ట్రలో ఆవు, గేదె పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచుతూ మిల్క్ ప్రొడ్యూసర్స్ అండ్ ప్రాసెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన కొత్త ధరలు ఆగస్టు 11 నుండి అమల్లోకి రానున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరగడం, అలాగే పాల ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు దాదాపు 30 శాతం వరకు ఎక్కువవడం వల్ల ఈ ధరల పెంపు తప్పలేదని డైరీ నిర్వాహకులు చెబుతున్నారు. పశుగ్రాసం మరియు దాణా ధరలు కూడా పెరగడంతో పాల ఉత్పత్తి వ్యయం పెరిగి రైతులు, డైరీలు నష్టపోకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ పాల ధరల పెంపు ప్రభావం కేవలం ప్యాకెట్ పాలపైనే కాకుండా ఇతర డెయిరీ ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, వెన్న, పన్నీర్ మరియు నెయ్యి వంటి వాటిపై కూడా పడనుంది. వీటి ధరలు కూడా సుమారు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిత్యావసరమైన పాల ధరలు పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల రోజువారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది. మహారాష్ట్రతో పాటే ఇటీవల మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన డైరీలు కూడా పాల ధరలను లీటరుకు రూ. 2 వరకు పెంచిన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande