విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై జిల్లా. ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై జిల్లా. ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై జిల్లా. ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం

రాజమండ్రి, 01 సెప్టెంబర్ (హి.స.)

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వీఆర్కు పంపుతూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి శివారులోని కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల మహిళపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై నాలుగు రోజులు ఆలస్యంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లాయి.

దాంతో ఈ కేసు నమోదు వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ నిర్ణయించారు. అందులో భాగంగా వారిని వీఆర్కు పంపారు. కోరుకొండ ఎస్ఐ రమేశ్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ ఏఎస్ఐ శ్రీదేవితోపాటు హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మణ్, నాగమల్లేశ్వరరావును వీఆర్కు పంపుతూ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande