
అమరావతి, 02 సెప్టెంబర్ (హి.స.)
తిరుమల, తిరుపతి (తితిదే), తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను బుధవారం రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నారు. గత పది వారాలుగా టోకెన్లను రద్దు చేస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ