వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం – రాయలసీమకు నెరవేరిన స్వప్నం
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం – రాయలసీమకు నెరవేరిన స్వప్నం
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం – రాయలసీమకు నెరవేరిన స్వప్నం


వెలిగొండ, 01 సెప్టెంబర్ (హి.స.)

పశ్చిమ ప్రకాశం, నెల్లూరు మరియు వైఎస్సార్ కడప జిల్లాల దాహార్తిని తీర్చే దిశగా నిర్మించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన వెలిగొండ (పూలసుబ్బయ్య) సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. దశాబ్దాల కాలంగా నానుతున్న ఈ ప్రాజెక్టు టన్నెల్ పనులను, హెడ్ వర్క్స్‌ను సవాలుగా తీసుకుని పూర్తి చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నల్లమల అడవుల గుండా ప్రవహించే కృష్ణా జలాలను జంట సొరంగాల (టన్నెల్స్) ద్వారా తీసుకెళ్లి కాలువలకు మళ్లించే ప్రక్రియ విజవంతంగా ప్రారంభమైంది.

వెలిగొండ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల దీర్ఘకాలంగా కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు పుష్కలంగా తాగునీరు, సాగునీరు లభించనుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటిలోని ఫ్లోరైడ్ రక్కసికి ఈ కృష్ణా జలాల రాకతో శాశ్వత పరిష్కారం లభించనుంది. కలుషిత భూగర్భ జలాల వల్ల దశాబ్దాలుగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు ఇది ఊరటనిచ్చే అంశం.

ఈ ప్రాజెక్టు తొలి దశ ద్వారా దాదాపు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, పదుల సంఖ్యలో మండలాలకు సురక్షితమైన మంచినీరు సరఫరా కానుంది. మిగిలిన డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను, ఫేజ్-2 టన్నెల్ పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు ప్రారంభంతో దశాబ్దాల కరువు తీరి తమ భూములకు జలకళ రానుండటంతో రాయలసీమ, పశ్చిమ ప్రకాశం ప్రాంత రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande