బిష్కెక్ ఎస్సీఓ సదస్సు: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ!
బిష్కెక్ ఎస్సీఓ సదస్సు: చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ!
modi


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

బిష్కెక్ (కిర్గిజిస్తాన్): షాంఘై సహకార సంస్థ (SCO) 26వ వార్షిక సదస్సు మంగళవారం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లోని 'వైరిస్ ఓర్డో కాంగ్రెస్ హాల్'లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు పరస్పరం కలుసుకుని వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అంతకుముందు బిష్కెక్ చేరుకున్న ప్రధాని మోదీకి భారతీయ సమాజం, కిర్గిజ్ అధికారులు ఘనస్వాగతం పలికారు.ఈ సదస్సు సందర్భంగా కిర్గిజిస్తాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు సంకల్పించారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.ఉగ్రవాద రహిత ప్రాంతమే లక్ష్యం:

ఈ రోజు జరగబోయే ప్రధాన సదస్సులో పీఎం మోదీ ప్రసంగించనున్నారు. ప్రాంతీయ భద్రత, కనెక్టివిటీ (సంధానత) లతో పాటు ఉగ్రవాదం, విచ్ఛిన్నవాదం మరియు తీవ్రవాద రహిత ప్రాంతాన్ని నిర్మించడమే లక్ష్యంగా భారత్ ప్రాధాన్యతలను ఆయన ఈ వేదికపై ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.వరల్డ్ నోమ్యాడ్ గేమ్స్ ప్రారంభోత్సవం:

సదస్సుకు ముందే సోమవారం నాడు ప్రధాని మోదీ మరియు ఇతర ఎస్‌సీఓ దేశాల నేతలు 6వ 'వరల్డ్ నోమ్యాడ్ గేమ్స్' ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో పాల్గొంటున్న 87 మంది సభ్యులతో కూడిన భారత క్రీడా బృందాన్ని ప్రధాని కలిసి అభినందించారు.ఈ అంతర్జాతీయ సదస్సులో రష్యా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ సహా 10 సభ్య దేశాల నేతలతో పాటు, 'ఎస్‌సీఓ ప్లస్' ఫార్మాట్‌లో భాగంగా టర్కీ, అజర్‌బైజాన్ వంటి మరో డజనుకు పైగా దేశాల ప్రతినిధులు మరియు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా పాల్గొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande