సరికొత్త రికార్డు సృష్టించిన యూపీఐ లావాదేవీలు
సరికొత్త రికార్డు సృష్టించిన యూపీఐ లావాదేవీలు
Upi


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.) దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య చరిత్రలోనే తొలిసారిగా 24.5 బిలియన్ మార్కును దాటింది. జూలై నెలతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన పరిమాణం, విలువ, వృద్ధి రేటు గణనీయంగా వేగం పుంజుకుంది. ఆగస్టులో రూ.29.8 లక్షల కోట్ల విలువైన 2,450 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూలై నెలలో రూ.29.9 లక్షల కోట్ల విలువైన 2,370 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 3.4 శాతం పెరిగినప్పటికీ, మొత్తం విలువ స్వల్పంగా తగ్గింది. గత ఏడాది ఆగస్టు 2025 నాటి 2,001 కోట్ల లావాదేవీలతో రూ. 24.85 లక్షల కోట్లు పోలిస్తే, ఈసారి పరిమాణంలో 22.5 శాతం, విలువలో 20 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. ఆగస్టులో రోజువారీ సగటున 79.06 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూలైలో నమోదైన 76.32 కోట్ల రోజువారీ సగటుతో పోలిస్తే ఇది మరింత పెరిగింది.

యూపీఐ ద్వారా చిన్న మొత్తాల చెల్లింపులు పెరగడంతో సగటు యావరేజ్ ట్రాన్సాక్షన్ సైజ్ తగ్గింది. ఆగస్టులో సగటు లావాదేవీ విలువ రూ.1,217గా నమోదైంది. ఇది జూలైలో రూ.1,263గా, ఆగస్టు 2025లో రూ.1,242గా ఉండింది. అయితే.. గత నాలుగేళ్లలో యూపీఐ సేవలు దాదాపు నాలుగు రెట్లు విస్తరించాయి. ఆగస్టు 2022లో నెలకు 658 కోట్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య ఆగస్టు 2026 నాటికి 2,450 కోట్లకు చేరింది. ఇదే సమయంలో లావాదేవీల విలువ రూ.10.73 లక్షల కోట్ల నుంచి రూ.29.8 లక్షల కోట్లకు పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande