
విజయవాడ(విద్యాధరపురం), 14 సెప్టెంబర్ (హి.స.)
: విజయవాడకు చెందిన డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో లేబరుకాలనీ మైదానంలో 72 అడుగుల పర్యావరణహిత ‘శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన వినాయకుడి ఆగమన కార్యక్రమంలో మంత్రి సవిత హాజరై, మహిళలతో కలిసి కోలాటం ఆడారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ