
తిరుపతి జిల్లా , 14 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వినియోగించే డీజేలకు అనుమతి లేదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
గణేశ్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సౌండ్ సిస్టమ్ల వినియోగంలో నిర్దేశిత శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్, ప్రజాభద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా ముందుస్తు చర్యలు చేపట్టామని, వివాదాలు లేదా అవాంఛనీయ పరిస్థితులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV