తిరుమల జీఎన్సీ టోల్గేట్ వద్ద చిరుత కలకలం..
తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్గేట్కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది.
leopard-


తిరుపతి, 14 సెప్టెంబర్ (హి.స.) తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ దగ్గర ఆదివారం అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. టోల్గేట్కు సమీపంలోని నడకదారి వద్ద చిరుత కొద్దిసేపు సంచరిస్తూ కనిపించింది. ఆ సమయంలో నడకదారిలో భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు, టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఆ తర్వాత కాసేపు అక్కడే సంచరించిన చిరుత అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తరచూ తిరుమల ఘాట్ రోడ్లు, నడకదారుల పరిసరాల్లో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande