
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి ఈ వివరాలను ఎలానో అధికారులు తీసుకెళ్లారు.
2.44 లక్షల హెక్టార్ల పంటలపై ఎల్నినో ప్రభావం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 54.2 శాతం లోటు వర్షపాతం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 284 మండలాలు, 1792 ఆర్ఎస్కే గ్రామాల పరిధిలోని పంటలపై ప్రభావం ఉందని వివరించారు.
హెక్టార్లలోని పంటలపై వివిధ స్థాయిల్లో ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. 192387 హెక్టార్లలో తేమ ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. 41474 హెక్టార్లలో పంటలు వాడిపోవడం,10582 హెక్టార్లలో పంటలు ఎండిపోయాయని తెలిపారు. తేమ ఒత్తిడిలో ఉన్న పంటలను కాపాడాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులతో రక్షణ తడులు అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ